మెడికల్ కాలేజ్ కి కొంగర రోహిత్ పార్థివ దేహం అప్పగింత..

నవతెలంగాణ -డిచ్ పల్లి
సీనియర్ మాజీ జర్నలిస్ట్ కొంగర శ్రీనివాస్ (చిట్టి) పెద్ద కుమారుడు రోహిత్ 33 మంగళవారం అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. మెడికల్ కళాశాల విద్యార్థుల ప్రయోగశాల పాఠానికి ఉపయోగపడడానికి   రోహిత్ పార్థివ దేహంను అందజేశారు .సమాజంలో అందరూ కూడా రోహిత్ ను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు నాయకులు అన్నారు.మృతదేహాన్ని మాధవ నగర్ నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి మెడికల్ కాలేజ్ లో అప్పగించగా మాజీ మంత్రి  మండవ వెంకటేశ్వరరావు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ(యం-యల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ప్రజా పంథా జిల్లా సహాయ కార్యదర్శి వి.ప్రభాకర్ , పౌరహక్కుల సంఘము నాయకులు నారాయణ రావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు  నర్రా రామారావు,  కార్పొరేటర్ ప్రతాప్ , న్యూ డెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, దాసు, కుటుంబ సభ్యులు,పి.డి.ఎస్.యూ,పి.వై.ఎల్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.