నేడు ఇల్లు చేరనున్న గల్ఫ్ బాధితుడి శవం

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ధిరాములు గత నెల 18వ తేదీన మస్కట్లో ఆహారం లేక, ఆరోగ్యం క్షీణించి మృతి చెందగా, గల్ఫ్ ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మృద్దేహానికి ప్రభుత్వ పరమైన అన్ని రకాల పత్రాలను సమకూర్చి, శవాన్ని నేడు స్వగ్రామానికి పంపిస్తున్నామని మండల గల్ఫ్ ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి తెలిపారు. సహకరించిన బండ్ల ఆంజనేయులు, హైమద్ లకు బాధిత కుటుంబం పక్షాన సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.