తెలుగు నాట ఎదిగినవాడ
మార్క్సిజం బాట పట్టినవాడ
ప్రజల నాడి తెలిసినవాడ
ప్రజలతో తిరిగినవాడ దోపిడోళ్ల దోపిడీని
కళ్ళ ముందు చూపినవాడ
ఓ మహోత్సవాల ధ్రువతార
ఓ మహా మేధావి
అక్షర జ్ఞానమా అధ్యయన శిఖరమా
ఆశయ రూపమా చైతన్య ప్రవాహమా
పదునెక్కిన పదజాలమా ఉత్తేజ ఉపన్యాసమా
కార్మిక కర్షక ఆత్మీయమా
విద్యార్థి యువతకు ఆదర్శమా
ఓ మహా మనిషి
మరణంతో అంతంకాదు నీ జీవితం
మరువలేము నీ కీర్తిని విప్లవస్ఫూర్తిని
లాల్ సలాం ఉద్యమాల ఊపిరి
లాల్ లాల్ సలాం
సీతారాం ఏచూరి-షేక్ బషీరుద్దీన్, 9794816603