
– తాడ్వాయి లో బీసీ బంధు పథకం చెక్కుల పంపిణి
నవతెలంగాణ- తాడ్వాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎంపీపీ గొంది వాణిశ్రీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 25 మంది లబ్దిదారులకు 25 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మయ్య( డి బి సి డి ఓ, ములుగు) ఆధ్వర్యంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ కులవృత్తులకు జీవం పోయడంతో పాటుగా ప్రతి కార్మికుడు కార్మికుడిగా మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ఎంపిటిసి కుక్కల శ్రీను, సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, నూశెట్టి సరిత, మాజీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, నాయకులు రజనీకర్ రెడ్డి, సోమ నాగమ్మ, సల్లూరు లక్ష్మయ్య, శేషగిరి, రంగు సత్యనారాయణ, బందెల తిరుపతి, మహిపతి లక్ష్మీ నరసయ్య, మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.