ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

నవతెలంగాణ- నవీపేట్: యుసిసి చట్టానికి మద్దతుగా బోధనలో ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను ఓ వర్గ ఓట్ల రాజకీయం కోసం అరెస్టు చేయడం సిగ్గుచేటని బీజేపీ మండల అధ్యక్షులు సరీన్ అన్నారు. మండలంలో బీజేపీ, బిజెవైఎం, మోర్చా నాయకులతో పాటు సొసైటీ డైరెక్టర్లను గురువారం అరెస్టు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల సమానత్వం కోసం కేంద్ర ప్రభుత్వం యుసిసి చట్టాన్ని క్యాబినెట్ ఆమోదం కోసం కృషి చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించ తలపెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వ నాగేశ్వరరావు, పిల్లి శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, గణేష్, కాంతం రెడ్డి,రాజేందర్ గౌడ్, రాము, గంగాధర్, రమణారావు తదితరులు పాల్గొన్నారు.