నవతెలంగాణ – గోవిందరావుపేట
పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం మండలంలో నాగజ్యోతి పర్యటించి కార్యకర్తల కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.చల్వాయి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ లీడర్ సత్తుభద్రయ్య ఇటీవల యశోద హాస్పిటల్ లో హార్ట్ ప్రాబ్లమ్ తో చికిత్స పొంది న విషయం తెలుసుకొని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే చల్వాయి గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు కొండా రమేష్ తల్లి కొండా సరోజన చెయ్యి ప్యాక్చర్ అవ్వగా పరామర్శించి కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చిన ఎల్లవేళలా మీకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నామ్ పూర్ణచందర్ చల్వాయి మాజీ సర్పంచ్ ఈసం సమ్మయ్య బొల్లం ప్రసాద్ భూ రెడ్డి మధు తాడువాయి మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రేండ్ల శ్రీనివాస్ చుక్క గట్టయ్య బైక్ అని ఓదేలు కొంపెల్లి కృష్ణారెడ్డి సామరాంరెడ్డి అక్కినపల్లి రమేష్ బుడిగ రఘు గోదా కనకయ్య పల్లె కుమార్ కొండ రమేష్ గజ్జల రంజిత్ పూసల మంజుల కారపాటి కృష్ణ ఆర్యం రాజు జంపాల రమేష్ రాస మల్ల సమ్మయ్య మోకానపల్లి మహేష్ పుర్రి స్వరూప విజయ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు