నవతెలంగాణ – తొగుట
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేయడం రైతుల్లో ఆనందోత్సవం నింపిందని కాంగ్రె స్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవా రం ఒక ప్రకటన ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయ న్యాయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీటవేయడం రైతుల్లో ఆనందోత్స వం నింపిందన్నారు. ప్రజలు నేటి ప్రజాపాలన విధా నాన్ని కోరుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. కానీ గత ప్రభుత్వంలో నాయకులు మాట్లాడే మాటలు వింటే ఊసరవెల్లి సైతం భయపడుతుం దని ఆరోపించారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఇష్ట అనుసారంగా మాట్లాడడం సిగ్గు చేట న్నారు. ఇకనైనా మీ వంకర బుద్ధిని మానుకొని ప్రజలకు సేవ చేసి మీరు చేసిన పాపాలను ప్రయా చిత్తం చేసుకోవాలని హితవు పలికారు.