నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఫిబ్రవరి 1న ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశంలో పేదలకు రైతులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ రూపొందించాలని బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ గౌడ్ కోరారు. గ్రామీణ పల్లె సీమలు దేశానికి పట్టుకమ్మలని, అలాంటి పల్లెల్లో నేడు వ్యవసాయ రంగం అనేక ఒడి దోడుకులను ఎదుర్కొంటుందన్నారు. గ్రామాలలో వ్యవసాయానికి రైతు కూలీలు దొరకడం లేదని వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గుత్యేతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందించే కిసాన్ సమ్మేళన నిధులను సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచాలని కోరారు. గ్రామాల్లో నేటికీ కోట్ల మంది నిరుపేదలు పక్కా ఇల్లు లేక జీవిస్తున్నారని, ఇల్లు నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 7 లక్షల వరకు రాయితీ అందించాలని అన్నారు. గృహపకరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గించి పేదలకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించాలని, రైతులకు ఎరువులపై సబ్సిడీని మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.