నవతెలంగాణ – ఆర్మూర్
గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్ల బడ్జెట్ తో ఎన్నారై పాలసీ అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం పై, చాలా ఆశలు వుండేవని శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఆ ఆశ నిరాశ అయ్యిందని బీసీ సంక్షేమ సంఘం ఎన్నారై అధ్యక్షులు బట్టు స్వామి ఆదివారం తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికులకు మొండి చెయ్యి చుయించింది అని అన్నారు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం,గల్ఫ్ దేశాల్లో టోల్ ఫ్రీ నం, గల్ఫ్ దేశాల్లో చనిపోయిన డెడ్ బాడీనీ 2 రోజుల్లో ఇంటికి చేర్చెల చర్యలు తీసుకోవాలని, గల్ఫ్ ఏజెంట్ మోసాలు, తెలంగాణలో గల్ఫ్ సెంటర్ ఏర్పాటు చేసి, గల్ఫ్ దేశాలకు వచ్చే వారికీ ట్రైనింగ్ , వాళ్లకు వచ్చినా పనిపై అవగాహణ కల్పించి, ఏ కంపెనీపై, ఎంత సాలరీ పై వెళ్తున్నాడు అని అగ్రిమెంట. ఒకవేళ అగ్రిమెంట్ ప్రకారం లేకపోతె తిరిగి స్వరాష్ట్రనికి తీసుకురావాలి అని అన్నారు. ప్రభుత్వ లైసెన్స్ పొందిన ట్రావెల్స్ కి మాత్రమే అనుమతి ఇవ్వాలనీ, ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఏజెంట్స్ మాత్రమే పని చేయాలనీ, గల్ఫ్ సెంటర్ తో అనుసంధానంగ పని చెయ్యాలనీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.