
నవతెలంగాణ – బొమ్మలరామారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఉందని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ర్యకలశ్రీశైలం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రధాన్యత ఇస్తాన్నమని ప్రకటన చేస్తున్నారే తప్ప ఆచరణలో శూన్యంమన్నారు. వ్యవసాయానికి ఎంత ప్రధాన్యత ఇస్తున్నారో ఈ బడ్జెట్లో తేలిపోయింది అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో రూ 10 వేల కోట్ల వ్యవసాయ రంగానికి తగ్గించారని ఎరువుల సబ్సిడీలో కూడా రూ 11వేల కోట్ల తగ్గించారని ఆరోపించారు. రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు సబ్సిడీలు ఇస్తూ అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. బడ్జెట్లో 25శతం వడ్డీ చెల్లింపుకే సరిపోతుందని ఆరోపించారు. రైతుల బ్యాంకు అప్పులను మాఫీ చేయడంలో శ్రద్ధ చూపని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల బ్యాంకు అప్పులను ఎగ్గొట్టేందుకు అవకాశం కల్పించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు.సన్న చిన్న మధ్య తరగతి రైతులకు ఉపయోగపడే విధంగా యంత్రికరణలో సబ్సిడీలు అందించే విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించి వ్యవసాయం రంగాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.