
– ఆందోళనలో రైతులు
నవతెలంగాణ- మల్హర్ రావు: ఓ వైపు ఎన్నికల బిజిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండగా మరోవైపు రైతన్నలు రేయింబవళ్లు శ్రమించి పండించిన ధాన్యం పంటలను అమ్ముకోవడానికి కల్లాల్లో ధాన్యాన్ని అరబోశారు. ఒక పక్కా కొనుగోలు కేంద్రాలు ప్రారంభకాక మరోపక్క మొగులు మబ్బలు కమ్ముకరావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున చిరు జల్లులు సైతం పడటంతో చేతికచ్చిన పంటలు ప్రకృతి ప్రకోపంతో ధాన్యం తడిసి నష్టం జరుగుతుంధోమోని రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని విక్రయించాలని మండల రైతులు కోరుతున్నారు.
గతంలో..
మండలంలో వానాకాలంలో 15.456 ఎకరాల్లో వరి పంట సాగయింది.దాదాపు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు వద్ద కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మండలంలో ఈ సారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మాత్రమే 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంబించాలని తాడిచెర్ల పిఏసిఎస్ పాలక వర్గం ఎంసి సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు తీర్మానం పంపినట్లుగా సమాచారం. డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు వద్దని, అలా జరిగితే పిఏసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు మొత్తమే చేయమని పాలకవర్గం కమిటీ మెంట్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో దాదాపు 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గతంలో 19 కొనుగోలు కేంద్రాలు..
మండల వ్యాప్తంగా పిఏసిఎస్, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో గతంలో 19 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ ఖరీప్ వరి పంటలు కోతలు మొదలైన ఇంకా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని పొలాల్లోనే అరబోస్తున్నారు. గన్ని బ్యాగులు సైతం రెడీగా తెలుస్తోంది. మండలంలో దాదాపు 10 శాతం మేర ధాన్యాన్ని రైతులు ఇప్పటికే దళారులకు విక్రయించినట్లుగా తెలుస్తోంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని దళారులు అందినంత దండుకుంటు దగా చేస్తున్నారు. మిల్లర్లతోపాటు ప్రయివేటు వ్యక్తులు కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులే స్వయంగా ధాన్యాన్ని గంగారాం కొనుగోలు కేంద్రానికి, రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు గ్రేడ్-1కు రూ.2.203, గ్రేడ్-2కు రూ.2.183 ధర ఉంది.కానీ దళారులు రూ.1800 నుంచి రూ.1900 లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలకు రూ.200 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు.