నవతెలంగాణ – డిచ్ పల్లి
పూర్వం అల్లకొండ లో నిర్మించిన ఇంజనీరింగ్ విధానం గొప్పదని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం.యాదగిరి అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో బాల్కొండ కు చెందిన బి.ఆర్. నర్సింగ్ రావు ” అల్ల కొండ ఊరు ఉద్భవం – ఐదు ఆలయాలకు ప్రసిద్ధి ” అనే చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. దేశంలోని పురాతనమైన కట్టడాలు పాత చట్టం ప్రకారంగా పురాతన కట్టడాలు మరమత్తులు చేయ కుండా వదిలి వేస్తే పూర్వ కట్టడాలు ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉందనీ పూర్వ రాజుల కాలంలో నిర్మిత మైన కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయనీ, భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పూర్వ చరిత్ర గల కట్టడాల రక్షణ, పు:న నిర్మాణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.పూర్వ కట్టడాలు బావి తరాలకు గుర్తుండి పోయే విధంగా పూర్వ చరిత్రను వెలుగు లోకి తెచ్చిన పుస్తక రచయిత నర్సింగ్ రావు ను రిజిస్ట్రార్ అభినందించారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ ద్వారా నేను వ్రాసిన పుస్తకానికి గుర్తింపు ఇవ్వాలని ఆయన రిజిస్ట్రార్ ను కోరారు.ఇది ఇలా ఉండగా బాల్కొండ ఖిల్లా చరిత్రను వివరిస్తూ ” అల్లకొండ పురీ రమ్యా నగై: నవభి రావృతా I తత్రైషా తు మహా యోధ: అల్లైయ్య, కొండయ్యా శిలా రుపహ: ప్రతిష్టితా II తొమ్మిది కొండల చేత చుట్ట బడి యున్న అందమైన అల్ల కొండ(బాల్కొండ) అనే గ్రామంలో మహా యోధులైన అల్లయ్య, కొండయ్య శిలా విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. పూర్వం ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన అల్లకొండ నగరం దేశంలోనే 2 వ రాజధాని అని ఇదే విషయాన్ని 1780- 1836 కాలంలో మద్రాసు సుప్రీంకోర్టు ప్లీడరు ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర లో పర్యటన చేస్తూ హైదరాబాద్ పట్టణం నుండి బిక్కవోలు, రతాల రామారెడ్డి,నుండి డిచ్ పల్లి, ఆరమూరు నుండి అల్లకొండ వరకు పాదయాత్ర గా 1830 లో జూన్ 26 నుండి 29 వరకు విడిది చేసినట్లు ఆయన వ్రాసిన డైరి ద్వారా తెలిసిందని అన్నారు. బాల్కొండ 1059 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ అల్లయ్య, కొండయ్య రాజుల పాలనలో ఖిల్లా నైసర్గిక ప్రకారంగా గిరి దుర్గంగ ఉందని. ప్రస్తుతం ఆనాటి కట్టడాలు శిధిల వస్థలో ఉన్నాయని,ఊరు చుట్టూ ఖిల్లా కు చెందిన భూములను వీటిని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని బాల్కొండ ఖిల్లని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని వారు కోరారు.