కూలీల ఆటోను ఢీకొీన్న బస్సు

కూలీల ఆటోను ఢీకొీన్న బస్సు– నలుగురు మహిళల మృతి
నవతెలంగాణ-మోతె
మిరప ఏరేందుకు ఆటోలో వెళ్తున్న కూలీలను బస్సు ఢీకొీట్టడంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా మోతె మండలం హుసేనాబాద గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల పరిధిలోని రామసముద్రం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(60), చెవుల నారాయణమ్మ(62), రెమి డాల సౌభగ్యమ్మ(60), రేపాల గ్రామానికి చెందిన పోగుల అనసూయమ్మ(70) మోతె మండలంలోని హుసేనాబాదలో మిరప ఏరడానికి బయల్దేరారు. కేశవాపురం వెళ్లే మార్గంలో ఉన్న అండర్‌పాస్‌ వద్ద ఆటోను ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢకొీట్టింది. దాంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు సూర్యాపేట ఏరియాస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలకు ఏరియాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. బాధితురాలు బెల్లంకొండ స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.