– విజయవాడ బస్టాండ్‌లో ప్రమాదం
– ముగ్గురు మృతి
విజయవాడ (బస్‌స్టేషన్): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 12వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి మృతిచెందారు. బస్సు డ్రైవర్ రివర్స్ గేర్‌కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 11, 12 ప్లాట్‌ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.