కొడుకును వాగులోకి నెట్టేసిన కసాయి తండ్రి

The butcher's father pushed his son into the riverనవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ పట్టణంలోని పెద్దపూల్‌ వాగులో కన్న కొడుకుని ఓ కసాయి తండ్రి నెట్టేసిన ఘటన శనివారం వెలుగు వచ్చింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన రాములు తన కొడుకు పండరి(14)ని  బాన్సువాడ నుంచి బోధన్ వెళ్లే రహదారి మధ్యలో ఉన్న పెద్దపూల్‌ వాగులో తోసేశాడని, కొడుకును వాగులో తోసేసినట్లు భార్య గంగమణితో చెప్పడంతో  భార్య దేశయిపేట్ నుంచి హుటాహుటిన వాగు వద్దకు వెళ్లి పరిశీలించగా పండరి ఆచూకీ లభించలేదు. అదే వాగుపై ఉన్న బ్రిడ్జి  మీదుగా వెళ్లుతున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. ఇందులో రాములు ఇంటి స్థలం విక్రయంకు భార్య అడ్డు చెప్పడంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కారణంగా కొడుకును వాగులో నెట్టేసాడా లేక భార్యను బెదిరించడం కోసం ఈ పని చేశాడా అనే  దానిపై అనుమానం వ్యక్తం అవుతున్నాయి. తల్లి గంగామణి బాన్సువాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ సిబ్బంది వాగు వద్ద పరిశీలించగా బాన్సువాడ టౌన్ సీఐ దేశ పేటలో విచారణ చేపట్టినట్లు సమాచారం.