జోరుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం..

నవతెలంగాణ- నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల కేంద్రం తో పాటు ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న లోక్ సభ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను  మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్,  బోయిని హనుమాన్లు, సాయగౌడ్ , శ్రీనివాస్ గౌడ్, మన్నే వెంకటి, షకీల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.