– మైనర్ మతి, మరో ముగ్గురు మైనర్లకు గాయాలు
– శంకర్‌పల్లిలో ఈ ఘటన
నవతెలంగాణ-శంకర్‌పల్లి
డివైడర్ పక్కన ఉన్న రాయిని ఢీకొని ఒ మైనర్ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైయ్యాయి. ఈ ఘటన శంకర్‌పల్లిలోని మండలంలోని గుడి సమీపంలో జరిగింది. శంకర్‌పల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5:30లకు శంకర్‌పల్లికి చెందిన నలుగురు మైనర్లు క్రికెట్ ఆడుకునేందుకు ఇంట్లో చెప్పి క్రికెట్ ఆడకుండా స్థానిక నాయకులు బిసోల అశోక్ కుమార్‌కు చెందిన టయోటా ఇటియోస్ కారు నెంబర్ AP 28DQ 1238 కారును ఒక మైనర్ తీసుకుని వెళ్లి మోకిలా మసీదు వద్ద మరొక మైనర్ ఎక్కించుకొని అక్కడి నుంచి మహారాజ్ పేటకు వెళ్లి మహారాజ్ పేట్‌లో ఇంకొక మైనర్‌తో కలిసి అతనితో కొద్దిసేపు మాట్లాడి మహారాజు పేట నుంచి తిరిగి వస్తూ మోకిలాలో మరో మైనర్‌ను దింపేసి సాయంత్రం ఆరుగంటల సమయంలో శంకర్‌పల్లికి వస్తుండగా మైనర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల డివైడర్ పక్కన ఉన్న రాయిపైకి కారు ఎక్కింది. దీంతో ఆ కారు కంట్రోల్ కాకపోవడంతో 50 మీటర్ల వరకు స్కిడ్‌గా వెళ్లి పక్కను ఉన్న ఒక గోడను ఢకొీని, మళ్లీ తిరిగి రోడ్డుపైకి వచ్చి బోల్తా పడటంతో ఒక మైనర్ తలకు తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురి మైనర్లకు గాయాలైయ్యాయి. కారును అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారణమైన మైనర్‌పై, కారు ఓనర్ బిసోల అశోక్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు శంకర్‌పల్లి పోలీసులు తెలిపారు.