– ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-హైదరాబాద్ డెస్క్
కారు అదుపుతప్పి చెట్టుకు ఢ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట మండలంలోని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ఆర్‌సి పురంకు చెందిన రాజేశ్వర్‌రావు (64) కుటుంబ సభ్యులతో కలిసి సాంట్రో కారులో కొమరవెల్లి దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం 8గంటలకు శామీర్‌పేట మండలం తుర్కపల్లి రెవెన్యూ పరిధిలోని అచ్చాయిపల్లి చెక్ పోస్టు సమీపంలోకి రాగానే కారు రోడ్డుకు ఎడమ వైపున చెట్టును బలంగా ఢ కొట్టింది. కారును డ్రైవ్ చేస్తున్న రాజేశ్వర్ రావు తో పాటు అతడి భార్య విజయ లక్ష్మి, కొడుకు ప్రవీణ్, కూతురు ప్రవళిక, అల్లుడు ప్రవీణ్‌కు బలమైన గాయాలయ్యాయి. వారందరినీ ఓజోన్ హాస్పిటల్‌లో చేర్పించేందుకు తరలిస్తుండగా రాజేశ్వర్‌రావు మార్గ మధ్యలోనే మతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.