కారు బేకార్‌..

The car is uncared..– రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన
– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేశాయి: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
నవతెలంగాణ – జమ్మికుంట/బడంగ్‌పేట్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, కారు బేకార్‌ అవుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన బీజేపీ జన గర్జన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగలేదన్నారు. దేశమంతా అభివృద్ధి చెందుతుంది కానీ హైదరాబాద్‌ మాత్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తెలంగా ణలో రెండుసార్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నిం చారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులే అధికారం చెలాయిస్తున్నారని, కుటుంబ పరిపాలనను అంగీకరించే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ధరణి పేరుతో అవినీతి జరిగిందన్నారు. ఈట ల రాజేందర్‌ను మంచి మెజారిటీతో గెలిపిం చాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని వేల కోట్లు డబ్బులు ఖర్చు చేసినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ కు పోకతప్పదని అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేజీ టు యూనివ ర్సిటీ వరకు ఉచిత విద్యను బీజేపీ అందిస్తుం దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఈటల జమునా రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్‌ పాల్గొన్నారు.
కేసీఆర్‌ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు
కేసీఆర్‌ ఒక్కరి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని, రాష్ట్ర ఏర్పాటులో యువకులదే ప్రముఖ పాత్ర అని రాజ్‌నాథ్‌సింగ్‌ రంగారెడ్డి జిల్లా సభలో అన్నారు. దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పదేండ్ల కాలంలో రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలన సాగిందని విమర్శించారు. నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకొని పరిక్షలు రాస్తే పేపర్‌ లీకేజీలు చేసి ఎంతో మంది విద్యార్థుల ఆత్మ హత్యలకు కారకులయ్యారన్నారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు పాకిందన్నారు. కాంగ్రెస్‌ పాలన పూర్తిగా స్కాంలతో కూడుకున్నదని ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి జవదేకర్‌, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు.