– కవిత బెయిల్‌పై మహేష్‌కుమార్‌గౌడ్, శోభారాణి ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కమలం, కారు ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి ఎద్దేవా చేశారు. ఆమెకు బెయిల్ రావడం ఊహించిందేనన్నారు. బెయిల్ వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయం నడుస్తున్నదని చెప్పారు. హరీశ్‌రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని విమర్శించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు జైలుకు పోయిందంటే మన రాష్ట్రానికి ఒక మచ్చలా మిగిలిపోయిందన్నారు. కేటీఆర్‌కు తన చెల్లి ఎందుకు జైలు పోయిందో చెప్పుకునే దమ్ము, ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న మహిళల గౌరవాన్ని తగ్గించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదేనన్నారు. మినరల్ డెవలంప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ ఢిల్లీలో రాత్రి డీల్ సెట్ అయిందనీ, వెంటనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. హైడ్రా సీఎం రేవంత్‌రెడ్డి ధర్మ యుద్ధం చేస్తున్నారనీ, ఆయన రియల్ హీరో అనీ, లేక్ మాన్ ఆఫ్ తెలంగాణ అని కొనియాడారు.