భూపోరాట నాయకులపై కేసులు ఎత్తివేయాలి

భూపోరాట నాయకులపై కేసులు ఎత్తివేయాలి– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
జగిత్యాల జిల్లాలో భూపోరాట నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, జైలు నుండి విడుదల చేయాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంక టయ్య అన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని, జగిత్యాల జిల్లాలో పోరాట నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, జైలుకు పంపిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పరిగి పట్టణంలోనూ డాక్టర్‌ బీఆర్‌ అం బేద్కర్‌ విగ్రహం ముందు సీపీఐ(ఎం) వ్యకాస ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్య వర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్‌ 437లో సుమారు 387 ఎకరాల్లో ఇండ్లు లేని పేదలను సమీకరించి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న సుమారు 4 వేల మంది పేదల గుడిసె లను అర్ధరాత్రి రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా జేసీబీతో గుడిసెలను తొలగించారు. తొలగించిన గుడిసె లకు నిప్పుపెట్టి తగులబెడుతున్న తరుణంలో ఇటువంటి దుందుడుకు చర్య సరికాదని అడ్డుకున్న 30మంది భూపో రాట నాయకులు, పేదలపై అక్రమ కేసులు బనాయించి 9 మందిని జైలుకు పంపించడం దుర్మార్గమన్నారు. వారం దరినీ తక్షమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తా రని భావించిన పేదలపై నెల రోజులలో తమ స్వరూపం బయట పెట్టిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వా మ్యాన్ని కాపాడుతామని గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన నియంతత్వ పోకడలకు పోము అని, అక్రమ అరెస్టులు కేసులు బనాయించామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్‌ ప్రభు త్వం నెల రోజుల్లో పేదలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దమాన కాండ చేయడమనేది సరికాదన్నారు. ఇప్పటికైనా తెలం గాణలో అనేక జిల్లాల్లో ప్రభుత్వ భూము లను ఆక్రమించిన రియల్‌ ఎస్టేట్‌ గద్దలజోలికి పోకుండా పేదలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలపై దాడులు దౌర్జన్యా లు మానుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇండ్ల స్థలాలతో పాటు రూ.15 లక్షలు ఆర్థికసాయం చేసి ఇండ్ల నిర్మాణం కోసం సహకరించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మండలం రంగాపుర్‌లో గతంలో సీపీఐ(ఎం) ఆధ్వ ర్యంలో గుడిసెలు వేసిన సర్వే నెంబర్‌ 18 లో 9-39 గుం టల ప్రభుత్వ భూమిని వెంటనే ఇళ్ల స్థలాలు లేని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అక్కడ కూడా మరో సారి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆ భూమిని ఆక్రమించి పేద ల ఇళ్ల స్థలాలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) వ్యకాస నాయకులు ఎండీ. హబీబ్‌, సత్యయ్య, రఘురామ్‌, రాంచెంద్రయ్య, రమేష్‌, వెంకటయ్య, మాంజిల్‌, ప్రశాంత్‌, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.