
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమ్సన్ పల్లి సెక్షన్ పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలకొల్పిన ప్లాంటేషన్ చూడముచ్చటగా ఉండడంతో బెస్ట్ ప్లాంటేషన్ లో భాగంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ కు ప్రశంస పత్రంతో పాటు పదివేల రూపాయల క్యాష్ అవార్డును 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ డి ఎఫ్ ఓ వికాస్ మీనా చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ మాట్లాడుతూ ఫారెస్ట్ పరిధిలో ఉన్న అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ లలో మొక్కల సంరక్షణకు అనుక్షణం జాగ్రత్తలు తీసుకుంటూ సంరక్షించడం జరుగుతుందన్నారు. ఉత్తమ పని తీరును సిబ్బంది కనబరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమిష్టి కృషి వల్లే ప్రశంస పత్రం లభించిందని పేర్కొన్నారు. రేంజ్ అధికారి రవి మోహన్ భట్ కు ప్రశంస పత్రం క్యాష్ అవార్డు రావడంతో తోటి సిబ్బంది రేంజ్ అధికారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.