కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీశ్రేణులు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు మండలంలోని పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి ఒకరినొకరు  శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం ఎంతో ఆనందంగా ఉందని, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఫలితమే నేటి కాంగ్రెస్ పార్టీ హవా అని,రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కష్టపడ్డారని ఆ కష్టానికి ఫలితమే ఈ అధికారమని కొనియాడారు.కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తదన్న నమ్మకం ఉందన్నారు.ఆరు గ్యారెంటీ ల హామీలను నెరవేర్చి ప్రజల మన్నన పొందుతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,విట్టల్,మారుతి బాబు సింగ్,యువకులు, బాలరాజు,అనికేత్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.