రైతులకు ఇచ్చిన హామీని విస్మరించిన కేంద్రం

– ప్రతీ రైతు ఉద్యమ ఆయుధమై తిరగబడాలి
– సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా
– సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
మూడు సాగు చట్టాల రద్దు కోరుతూ జరిగిన రైతాంగ ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించి మోసం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా అన్నారు. సీపీఐ జాతీయ, రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దేశ రాజదాని ఢల్లీీలో రైతాంగం నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నట్లు హామీ ఇచ్చిన కేంద్రం సంబందిత రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా ఆదేశాలు జారీ చేయలేదన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు నష్టపరిహారం విషయలో కేంద్రం మీనమేశాలు లెక్కిస్తోందన్నారు. పండించిన పంటలకు మద్దతు దర చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నెలల గడుస్తున్నా కమిటీని ఏర్పాటు చేయకుండా మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, కల్లూరి వెంకటేశ్వరరావు, ఎస్‌డీ సలీం, కె.సారయ్య, రావులపల్లి రవికుమార్‌, వై.భాస్కర్‌ రావు, దేవరకొండ శంకర్‌, వి.పూర్ణచందర్‌ రావు, జి.రామకృష్ణ, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, రాంచందర్‌, వెంకటేశ్వర్లు, నాగయ్య, వీరాస్వామి, మల్లికార్జున్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.