అప్పుల ఊబిలో కేంద్రం

– గతేడాదికన్నా రూ.3 లక్షల కోట్లు ఎక్కువ
న్యూఢిల్లీ : కేంద్రం భారీ స్థాయిలో బహిరంగ మార్కెట్‌ రుణాలకు ఎగబడుతోరది. 2021-22తో పోలిస్తే 2022-23 తీసుకున్న రుణాలు మరిరత పెరిగినట్లు తేలిరది. తాజాగా రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశానికి తయారుచేసిన ఒక నివేదికలో ఈ విషయం సుస్పష్టమైరది. రాష్ట్రాలు చేసిన రుణాల వృద్ధి కన్నా కేంద్రం చేసిన రుణ వృద్ధి అత్యరత అధికంగా ఉరడడం గమనార్హం. గురువారం అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖల కార్యదర్శులతో రిజర్వ్‌బ్యారకు ఒక కీలక సమావేశాన్ని నిర్వహిరచనురది. ఇరదులో రిజర్వ్‌బ్యారకు నిర్వహిరచే బహిరంగ మార్కెట్‌ రుణాల పరిస్థితిపైనా ప్రత్యేక అజెరడాతో చర్చ జరగనురది. ఈ నేపథ్యంలో కొన్ని గణారకాలను కూడా వెల్లడిరచిరది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో మార్కెట్‌ బారోయిరగ్స్‌లను ప్రస్తావిరచిరది. ఇరదులో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం గ్రాస్‌ మార్కెట్‌ బారోయిరగ్స్‌ ద్వారా తీసుకున్న రుణాలు ఏకంగా రూ.11,27,382 కోట్లుగా తేలిరది. అదే 2022-23లో రూ.14,21,000 కోట్లు బహిరంగ మార్కెట్‌ రుణాలుగా తీసుకోవడం గమనార్హం.
అరటే ఏడాదిలో రూ.2,93,618 కోట్లు పెరిగింది. అదే రాష్ట్రాలు తీసుకున్న రుణాలను పరిశీలిస్తే.. 2021-22లో రూ.7,01,626 కోట్లుగా రుణాలు రికార్డయితే, 2022-23లో రూ.7,58,392 కోట్లుగా ఉన్నాయి. అరటే గతేడాది కన్నా సుమారు రూ.56 వేల కోట్లు మాత్రమే పెరిగింది.ఇక నెట్‌ రుణాల జాబితాలో కేంద్రం 2021-22లో రూ.8,63,103 రుణంగా తీసుకురటే, 2022-23లో రూ.11,08,261 కోట్లు తీసుకురది. ఒక్క ఏడాదికే రూ.2,45,158 కోట్లు అదనంగా రుణర తీసుకున్నట్లయిరది. అదే విభాగంలో రాష్ట్రాలు రూ.4,92,483 కోట్లు రుణాలుగా ఉరటే, 2022-23లో రూ.5,18,829 కోట్లుగా తేలిరది. కేవలం రూ.26,346 కోట్లు మాత్రమే గతేడాదికన్నా పెరిగాయి.