నవతెలంగాణ – కామారెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించరు. ఈ సమావేశానికి కామారెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా ఇంచార్జ్ పశ్య పద్మ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము తెలంగాణపై బడ్జెట్ విషయంలో, ఇతరుల రంగాలలో చిన్నచూపు చూస్తుందనీ, ప్రజలకు ఇచ్చిన హామీలను బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ధనిక వర్గానికి అనుకూలంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఉన్నత వర్గ సంబంధించిన వారి గురించి ఆలోచిస్తున్నారని నిరుపేదలను మరి నిరుపేదలుగా బిజెపి ప్రభుత్వము విధానాలు అమలు చేస్తున్నాయని కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ మతం పేరుతో ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారన్నారు. సామాన్యుడు బతికే పరిస్థితి లేదని నిరుద్యోగం అధిక ధరలు అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆమె అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సంవత్సరమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నికలలో హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కార్మిక రంగాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఇచ్చిన గ్యారంటీలను పథకాలను వెంటనే అమలు చేయాలని లేకుంటే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శిఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దుబాస్ రాములు, జిల్లా నాయకులు శంకర్, రాజమణి, మల్లేష్, దేవయ్య, నాగమణి, రేఖ, సాయిలు, కాసిం, హైదర్, రాజవ్వ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.