కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ కుల గణన చెయ్యాలి 

The central and state governments should immediately conduct a BC caste census– బీసీలకు దూరమైనందునే బీజేపికి పూర్తి మెజారిటి రాలేదు
– ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి కులగణన చెయ్యాలి
– లేకపోతే మరో మండల్ పోరాటం తప్పదు 
– బీసీలకు అడ్డు వచ్చే వారిని గద్దెదింపక తప్పదు
– జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బిసి కులదరణ చేయాలని, బీసీలకు దూరమైనందునే బిజెపికి పూర్తి మెజారిటీ రాలేదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కుల గణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే మరో మండల్ పోరాటం తప్పదని బీసీలకు అడ్డువచ్చే వారిని పెద్దదింపగా తప్పదని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొన్నటి కేంద్ర ఎన్నికలే బీసీల ఐక్యతకు నిదర్శనం అని తెలియజేశారు. కుక్కలకు, పులులకు, అడవి జంతువులకు లెక్కలు ఉన్నాయి కాని బీసీల లెక్క లేకపోవడం శోచనీయం అని అన్నారు. బీసీల లెక్కలు తీస్తే జాతీయ సమగ్రతకు లాభమే కాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. భాషా పరమైన లెక్కలు, జాతుల పరమైన లెక్కలు ఉన్నప్పుడు బీసీల లెక్కలే ఎందుకు ఉండవు అని తెలియజేశారు. సభ ప్రారంభానికి ముందు దివంగత నాయకులు ధర్మపురి శ్రీనివాస్ చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ సభాధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆకుల ప్రసాద్, గంగా కిషన్, కరిపే రవిందర్, దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్, చంద్రమోహన్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, నారాయణ రెడ్డి తో పాటు రాష్ట్ర నాయకులు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ రాష్ట్ర, కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనగల శ్యాం కుమార్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వేముల వెంకటేష్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.