
నవతెలంగాణ – మునుగోడు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతులను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మోసం చేసేలా ఉంది అని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం బడ్జెట్లో రైతులకు మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేశారు. రైతన్న పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దారణమని అన్నారు. రైతన్నకి రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క ఆమె నెరవేర్చేందుకు ఈ బడ్జెట్లో ప్రతిపాదనలేదని అన్నారు. ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోతలు పెట్టారని మండిపడ్డారు . కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం, దేశంలో సగం మందికిపైగా ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించకపోవడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, యాట యాదయ్య, జేరిపోతుల ధనంజయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.