
జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిఅన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో గట్టుపల టౌన్ శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. ఓట్ల రాజకీయం కోసం చరిత్రను ఒకేకరిస్తారా, వీర తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి, రాచరికానికి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడని చరిత్ర కమ్యూనిస్టులదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలోవెట్టి చాకిరి,దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంజరిగిందన్నారు. ఈ పోరాటంలో మొదటి తూటాకు దొడ్డి కొమరయ్య బలయ్యారని ఆయన అన్నారు. ఆనాటికాంగ్రెస్ ప్రభుత్వంలోవేలాదిమంది కమ్యూనిస్టులు మరణించార న్నారు.భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టులు పోరాడారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు మత రంగు పూయడాన్నిఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల ముందుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజలకు ఇచ్చినహామీలనువెంటనే అమలు చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలలోరైతు భరోసా,రుణమాఫీకొంతమంది మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులందరికీ కూడారుణమాఫీని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ దేశంలోబిజెపి అనుసరిస్తున్నప్రజా వ్యతిరేక విధానాల ను తిప్పి కొట్టాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సీపీఐ(ఎం) గట్టుపల్ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎండి. రబ్బాని, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం,కుకునూరు నగేష్,సిపిఎం నాయకులుఖమ్మం రాములు,పెదగాని నరసింహ,ముసుకు బుచ్చిరెడ్డి,నల్లవెల్లి బిక్షం,పసుపుల చెన్నయ్య,కె. నరసింహ, జ్ఞానేశ్వరి, ఉష, రాములమ్మ, అంశమ్మ, సావిత్రమ్మ, యాదమ్మ, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు. అనంతరం గట్టుపల్ టౌన్ శాఖ కార్యదర్శిగాకర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.