నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర ప్రభుత్వానికి విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేద నీ యుఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సిద్దాల నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపుల ప్రస్థావన లేదు, ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసి, కార్పోరేట్ కు ఊడిగం చేసేందుకే ఈ బడ్జెట్ – నూతన విద్యావిధానం-2020 అమలు అంటూనే, కనీసం ఎన్.ఇ.పి ప్రస్తావించిన బడ్జెట్ కేటాయింపులు లేవు అని అన్నారు. – ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ విద్యారంగానికి తీవ్ర మొండి చెయ్యి చూపించింది. దేశంలో విద్యాభివృద్ధి కోసం కనీసం కేటాయించాల్సిన నిధులను కేటాయించలేదు. గత ఓటాన్ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు , ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు కేవలం 0.1 మాత్రమే బడ్జెట్ ను పెంచారు. బడ్జెట్ మొత్తంలో పెరిగినట్లు ఉన్న గతం కంటే విద్యారంగానికి బడ్జెట్ తగ్గింది. గత మొత్తం బడ్జెట్ 45,03,638 కోట్ల నుండి 48,21,000 కోట్లకు పెరిగింది. అంటే 7 శాతం బడ్జెట్ పెరిగింది. కానీ విద్యారంగానికి తీవ్రంగా నిధులను తగ్గింపు చేశారని అన్నారు. గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి 1,12,899(2.5%) కోట్లు బడ్జెట్ కేటయింపులు చేసిన కేంద్రం లో నాడు బడ్జెట్ లో ప్రతిపాదించిన డిజిటల్ గ్రంథాలయం నిధులు, జాతీయ విద్యా మిషన్ నిధులు, ఏకలవ్య పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ, 157 నర్సింగ్ కళాశాలలు,ఐటీఐ లకు బడ్జెట్ వంటి అంశాలను ప్రస్తావనే లేదు గత నిధులు పూర్తిగా ఖర్చు చేయకుండా పేపర్ పైనే బడ్జెట్ ను చూపిస్తుంది అని, ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర విశ్వవిద్యాలయాలు అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే యు జి సి కి భారీగా నిధులు కోతపెట్టారు గత బడ్జెట్లో యుజిసికి 5360 కోట్లు కేటాయించగా క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తున్నారు అని అన్నారు. 2023 లో యు జి సి కి 6409 కోట్లు రూపాయలు మాత్రమే యుజిసికి కేటాయించారు.
కేంద్ర యూనివర్సిటీలకు గతం కంటే స్థూలంగా నిధులు పెంచారు గత బడ్జెట్లో 14,903.87 కోట్లు కేటాయింపులు చేస్తే ప్రస్తుతం 15,928 కోట్లు కేటాయించారు. సెంట్రల్ యూనివర్సిటీ నూతన భవనాలు ఫెలోషిప్ పెంపు హాస్టల్స్ నిర్మాణం గురించి అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. ఐఐటీలను గత బడ్జెట్లో 9661.50 కోట్లు ఈ బడ్జెట్లో 10,324.50 కోట్లు కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ గురించి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు కేటాయింపులు గురించి, ఈ బడ్జెట్ లో ప్రస్తావన తీసుకొని రాలేదు. ఎన్ఐటీలకు గత సంవత్సరం 4820.60 కేటాయిస్తే ఈ సంవత్సరం 5040 కోట్లు -ఐఐఎస్ ఆర్ గత సంవత్సరం 815.40కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 918.27 కోట్లు కేటాయించారు.- ఐఐఎస్ ఆర్ లకు గత సంవత్సరం 1462 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 1540 కోట్లు కేటాయించారు అని అన్నారు. కొఠారి కమిషన్ పరంగా కేంద్ర ప్రభుత్వం 10 శాతం విద్యారంగానికి నిధులు ఇవ్వాలని నేను ఎడల పార్లమెంటు ముట్టడికైనా వెనకాడ బొమ్మని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.