కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు . శుక్రవారం కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్కు నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపి బడ్జెట్ పత్రంను కాల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 , 2025 బడ్జెట్లో రైతులకు అనుకూలమైన బడ్జెట్ పెట్టలేదని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి మును ముందు ఇలాంటి బడ్జెట్ లు పెడితే రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయి రాబోవు రోజుల్లో రైతులు వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి దాపరిస్తుందని అన్నారు . రైతులే అన్న మో రామచంద్ర అంటూ బాధపడాల్సి వస్తుంది అని అన్నారు. కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ సాధారణ ప్రజలను మోసం చేసి వీరు నుండి పన్నులు వసూలు చేసి కార్పోరేట్ శక్తులకు ఆదాని, అంబానీ లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు , ఇలాంటి బడ్జెట్లపై రైతులు రైతు కూలీలు రైతు సంఘాలు ప్రజలు తిరగబడాలని మునుముందు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను , సిపిఎం మండల కార్యదర్శి మిరియాల భరత్ , సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , ఏర్పుల యాదయ్య, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బండమీది యాదయ్య , మందుల పాండు , వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ , బొట్ట శివ కుమార్ , యాస రాణి శ్రీను ,సాగర్ల మల్లేష్ , యువజన నాయకులు బండారు శంకర్ దుబ్బ వెంకన్న కురుమర్తి ముత్తయ్య ఎస్ఆర్ఎన్ శీను వరికుప్పల ముత్యాలు హనుమయ్య తదితరులు ఉన్నారు.