నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దు పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం సెంట్రల్ సోషల్ ఆడిట్ బృందం అకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ బృందం సభ్యులు మోహన్ రావు, సుమలత, మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు రికార్డులను పరిశీలించారు. వారి వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. వెంకటలక్ష్మి, పిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ ప్రియ, ఉపాధ్యాయులు కృష్ణ, రాజేశ్వర్, ప్రభాకర్, సాయన్న, రాములు, రాధా, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.