
నవతెలంగాణ – చండూరు
నేటి విద్యార్థినీ విద్యార్థులు విద్య తో పాటు వికాసాన్ని పెంపొందించుకోవాలని స్థానిక చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న అన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా విద్యా సంవత్సరం మొదటి రోజున హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను దుస్తులను ఆమె అందజేశారు. చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను ఉపయోగించు కోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు, ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మేనేజర్ అరుణ, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ విజయ, ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం, అరుణ, టిఎంసి సరిత, మమత, వాసంతి, నరసింహారావు, సైదులు, నాగరాజు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, యాదయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.