– జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు.. కొడారి వెంకటేష్ ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పార్లమెంటు తీర్మానంతో చట్టం పరిధిలోకి వచ్చిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పట్ల వివక్ష చూపడం, కనీసం వారికి గుర్తింపు ఇవ్వకపోవడం చాలా విచారించదగ్గ విషయమని జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం భువనగిరి శివారులోని ఒక ప్రైవేటు హోటల్ లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ సభ్యులను కనీసం సభకు పరిచయం చేయకపోవడం, జిల్లా చైర్మన్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు. జిల్లా సర్వ సభ్య సమావేశానికి, సాదారణ సభ్యులతో పాటు, మొత్తం 15 మంది జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరైనా, వారిని వేదిక మీదకు పిలువకపోవడం, కనీసం సభకు పరిచయం చేయకపోవడం, వారిని కేవలం సాదారణ సభ్యులుగానే గుర్తించడం, జిల్లా చైర్మన్ సభ్యుల పట్ల చూపెడుతున్న వివక్షగా భావిస్తున్నామని ఆయన అన్నారు. తనకు నచ్చిన వారితో అతిథులకు బొకేలు ఇప్పించడం, సన్మానం చేయించడం సరియైన పద్ధతి కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ సేవాసంస్థ గా గుర్తింపు పొందిన సంస్థకు సుమారు 200 మందిని సభ్యులను పరిచయం చేసిన, మాజీ ఎమ్మెల్యే సర్వసభ్య సమావేశానికి హాజరైనా , ఆ మాజీ ఎమ్మెల్యే ను వేదిక మీదకు పిలవకపోవడం, సంస్థకు తీవ్ర నష్టం కల్గించే విషయమని ఆయన అన్నారు. జిల్లా చైర్మన్ ఒకే సామాజిక వర్గానికే ఎక్కవ ప్రాదాన్యత ఇవ్వడం, సంస్థలో రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించడం, బంధుప్రీతి తో, ఇష్టానుసారం సంస్థను నడిపిస్తున్న విషయం పై జిల్లా కలెక్టర్ , రాష్ట్ర గవర్నర్ ల దృష్టికి తీసుకెళ్తామని సంస్థ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గవర్నర్ ను కోరుతామన్నారు.