సీఎంను కలిసిన కార్పొరేషన్ల చైర్మెన్లు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో పలు కార్పొరేషన్ల చైర్మెన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఓబెదుల్లా కొత్వాల్‌, ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌ బిన్‌ అందాని, క్రిష్టియన్‌ మైనారిటీ చైర్మెన్‌ దీపక్‌ జాన్‌ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. తమ నియామకాల పట్ల వారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు.