నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంగళవారం కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. ఛైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, ఈఓ కె .వినోద్ రెడ్డి పూర్ణకుంభ తో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడిమొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి వేద పారాయణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు. ఆలయ ఈఓ వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాద్ అని అందజేశారు.వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు, మునిసిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, కనికరపు రాకేష్ , వస్తాది కృష్ణ ప్రసాద్ , పాత సత్యలక్ష్మి తో పాటు తదితరులు ఉన్నారు.