పెద్ద ఎక్లారాలో 1000 ఓట్లు మావే అంటూ సవాల్..

నవతెలంగాణ – మద్నూర్

ఈనెల 13న జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో మొత్తం పోలైన ఓట్లు 1737 కాగా వీటిలో 1000 ఓట్లు మాకంటే మాకే పడ్డాయి అంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. బుధవారం నాడు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ పటేల్ పోలైన ఓట్లలో వెయ్యి ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి అంటూ సవాల్ విసురుగా కాంగ్రెస్కు కాదు బీజేపీకే వెయ్యి ఓట్లు పడ్డాయి అంటూ ఆ గ్రామ బీజేపీ పార్టీ నాయకులు మద్నూర్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పండిత్ రావు పటేల్ సవాల్ చేశారు. ఈ విధంగా పల్లె గ్రామాల్లో ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటాపోటీగా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన నాయకులు ఈ విధంగా సవాలు విసురుకుంటున్నారు.