చామలను భారీ మెజార్టీతో గెలిపించాలి….

– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  అన్నారు. శుక్రవారం అయినా వలిగొండ మండల కేంద్రంలో, వలిగొండ  మండలంలోని వెలువర్తి, ఆరూరు, ప్రొద్దుటూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని అందులో భాగంగానే ఆరోగ్యానికి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. భారతదేశ రాజ్యాంగం మార్చకుండా ఉండాలంటే, అందరికీ సమాన హక్కులు దక్కాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే చేయి గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, జడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి, ఆయా గ్రామాల ఎంపిటిసిలు తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారు.