కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి  కామారెడ్డి జిల్లా చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి డాక్టర్  వి. ఆర్.ఆర్.వరప్రసాద్ ప్రారంభించరు . ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి  వరప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కమ్యూనిటీలో ఎలాంటి సమస్యలు ఉన్న అది ఫ్యామిలీ సమస్య కావచ్చు, అది సివిల్ సమస్య కావచ్చు ఆ సమస్యను పరిష్కరించేందుకు కమ్యూనిటీ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ అయినా  అలీమోద్దిన్, ఖలీల్ హుల్ల, షేక్ లతీఫ్ లను  అభినందిస్తున్నానన్నారు .ఈ కార్యక్రమంలో కామరెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి  సూపరింటెండెంట్  ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్  సమీఉల్లా ఖాన్, కమ్యూనిటీ మెంబర్స్ మహమ్మద్ ఖలీల్ హుల్ల, షేక్ అలీమోద్దీన్, షేక్ అబ్దుల్ లతీఫ్,  విజయ్ కుమార్,  నిర్మల,  స్వప్న , కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.