
నవతెలంగాణ కంటేశ్వర్
న్యాయ బద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చాల్సిన అవసరం ఉందని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడ వేటి వినోద్ అన్నారు.గురువారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో 6 వ రోజు రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో వంట వార్పు తో నిరసన తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ కేసీఆర్ మనసు మార్చు మమ్మల్లి రెగ్యులరైజ్ చేయాలని వేడుకున్నారు.బిసిటీయూ ఉపాధ్యాయు సంఘం జిల్లా అధ్యక్షులు మాడ వేడి వినోద్, డెమొక్రటిక్ పెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య, బిసిటీయూ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ, ఉపాధ్యాయ సంఘం డి టి ఎఫ్ ఉపాధ్యాయ సంఘo అధ్యక్షులు రాజన్న, ఉపాధ్యాయ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వినోద్,బాలయ్య లు మాట్లాడుతూ.వనపర్గిలో ముఖ్యమంత్రి మాట ఇచ్చినట్లు అందరిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాలలో అధికారులకు ఇటు ఉపాధ్యాయలకు వారధిగా ఉంటూ ఉదయం అందరికంటే ముందుగా వచ్చి సాయంత్రం అందరికంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళేది సమగ్ర శిక్ష ఉద్యోగులే అన్నారు. పాఠశాలల్లో విద్య ప్రమాణాలు సరైన పద్దతిలో వెళ్లి విద్య లో ఉత్తమ ఫలితాలు సాదించుటలో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్లు ఆపరేటర్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర మరువలేనిది అన్నారు. తక్షణమే ప్రభుత్వం బేషరతుగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి ప్రసాద్ అంజయ్య విజయ్ సురేందర్ అంబదాస్ రావు భూపేందర్ యూసుఫ్ అలీ బాలరాజ్, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.