మండల కేంద్రంలోని గుండ్లకుంట్ల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి గ్రామ శివారులో ఉన్న గుండ్లకుంట్ల భక్తాంజనేయ స్వామి దేవాలయం తాళం పగలగొట్టి అందులో ఉన్న వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని, అదేవిధంగా రెండు రూముల తాళాలు పగలగొట్టి వాటిలో ఉన్న వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకునిపోయారని ఆలయ అర్చకురాలు లక్ష్మి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి, పోలీసులు గుండ్లకుంట్ల భక్తాంజనేయ స్వామి దేవాలయంను పరిశీలించారు.సంఘటన స్థలంలో క్లూస్ టీం సభ్యులు నిందితులను గుర్తించేందుకు ఆధారాలను సేకరించారు.