మణిపూర్‌ హింసను ‘చర్చి’ ఉపేక్షించదు

– క్రైస్తవులపై సంఫ్‌పరివార్‌ ప్రేమ ఓట్ల కోసమే : కేరళ సీఎం పినరయి విజయన్‌
న్యూఢిల్లీ : మణిపూర్‌ హింసను ‘చర్చి’ మర్చిపోదనీ, ఓట్ల కోసమే క్రైస్తవులపై సంఫ్‌ పరివార్‌ ప్రేమను గుప్పిస్తున్నదని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. పాలస్తీనా ప్రజలపై జియోనిస్ట్‌ శక్తులు మారణహౌమం లాంటి క్రూరత్వానికి సమానమైన హింసను మణిపూర్‌లోని ఒక నిర్దిష్ట సమాజం వారి మత విశ్వాసం కారణంగా మాత్ర మే అనుభవిస్తున్నారని అన్నారు. ”జియోనిస్టులు పాలస్తీనా ప్రజలు భూమి నుంచి తుడిచిపెట్టబడాలనీ, పాలస్తీనా అనేది మ్యాప్‌ నుంచి అదృశ్యం కావాలని కోరుకుంటున్నారు. మణిపూర్‌.. మ్యాప్‌ నుంచి కనుమరుగవడాన్ని సంఫ్‌ు పరివార్‌ కోరుకోనప్పటికీ, ఆ గడ్డపై ఒక నిర్దిష్ట సమాజం జీవించడం వారికి ఇష్టం లేదని ఆ రాష్ట్రంలో జరిగిన సంఘ టనలు రుజువు చేశాయి” అని త్రిక్కాకర అసెంబ్లీ నియోజక వర్గంలో సోమవారం జరిగిన నవకేరళ సదస్సులో విజయన్‌ అన్నారు. మణిపూర్‌ ప్రజలపై క్రూరత్వాన్ని అరికట్టడానికి వేలు కదపని అధికార పీఠంలోని వారు ఇప్పుడు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ స్నేహపూర్వకం గా మాట్లాడుతున్నారని తెలిపారు. శత్రుత్వాన్ని అణిచివేసుకుంటూ స్నేహం కోసం చేసిన ప్రయత్నాలు ఓట్ల కోసమేనన్నారు. రాజ్యాంగం ప్రకారం మనది సెక్యులర్‌ దేశమైనా కొన్ని ప్రాంతాలలో ప్రజల మత విశ్వాసాల కారణంగా హింస చెలరేగిందని ఆయన తెలిపారు. భారత్‌.. ప్రపంచ వ్యవహారాల్లో భారతీ యులమైన మనకు గర్వకారణమైన స్థానాలను అవలం బించేదనీ, కానీ ఇప్పుడు అలా లేదనీ, గాజాపై దాడి జరిగిన వెంటనే భారత్‌ ఇజ్రాయెల్‌కు అండగా ఉన్నదని ప్రధాని ప్రకటించటం అవమానం కలిగించే విషయమని విజయన్‌ చెప్పారు.