పార్కులను పరిశీలించిన నగర మేయర్

నవతెలంగాణ- కంటేశ్వర్
నగరంలోని 6వ డివిజన్ అమరవీరుల పార్క్, న్యూ ఎన్జీవోస్ కాలనిలో ఏర్పాటు చేస్తున్న పంచతత్వ పార్కులను, 22వ డివిజన్ లోని బస్వా గార్డెన్ వెనకాల గల పార్కులను మేయర్ దండు నీతూ కిరణ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి గురువారం పర్యవేక్షించారు. పార్కులాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లను పరిశీలించి ఉపయోగంలో లేని పరికరాలను త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఉల్లాసం ఉండటానికి ప్రతి ఒక డివిజన్ లో ఒక పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు రచించి ఏర్పాటు చేశామని అందులో పిల్లలు ఆదుకుండేందుకు వీలుగా అట వస్తువులను అందుబాటులో ఉంచామని అన్నారు స్థానికంగా ఉన్న ప్రజలు పార్కులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ ఇంజినీర్ సల్మాన్ ఖాన్, సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.