వర్గీకరణ కమిటీని వెంటనే నిలిపివేయాలి 

– మాల మంత్రులేకుండా మాల కు వ్యతిరేకంగా కమిటీ ఎలా వేస్తారు 
– ఈ యొక్క కమిటీలో న్యాయ మూర్తి కమిషన్ నియమించాలి
– వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మద్దెల నర్సింలు
నవతెలంగాణ – మిరుదొడ్డి 
వర్గీకరణ పై వేసిన కమిటీని వెంటనే నిలిపివేయాలి, లేనియెడల గాంధీ భవనం ముట్టడిస్తాం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మద్దెల నర్సింలు, సిద్దిపేట అంబేద్కర్ నగర్ లోని మాల కుల సంఘం సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమిటీలో మాల మంత్రి ఎందుకు లేడని ప్రశ్నించారు. తెలంగాణలో మాదిగల కంటే మాలల ఉపకులాలు ఎక్కువ జనాభా కలిగి ఉన్నాయని అన్నారు. కులాల విభజన పట్ల మొండిగా వివరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు. కమిటీలో తప్పనిసరిగా న్యాయమూర్తి కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉప సంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేస్తోంది అన్నారు. వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోంది తెలిపారు. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని అన్నారు.  ఏకపక్షంగా ఉన్న ఈ  మంత్రుల కమిటితో తెలంగాణ లో మాల, మాల ఉప కులాలకు ఏమాత్రం న్యాయం జరగదు. ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటిని ఎలా నియస్తారని మండిపడ్డారు.మంత్రుల కమిటీ లోనే మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు.. మంత్రుల కమిటీలో మాల మంత్రి ఎందుకు లేరని నిలదీశారు. ఈ కమిటి స్థానంలో న్యాయమూర్తి తో కమిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. తెలంగాణ లో మాదిగల జనాభా కంటే మాల , మాల ఉప కులాల జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటితో  మాలలకు అన్యాయం జరుగుతుందాని అన్నారు.  ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కో కన్వీనర్  దళిత సంఘాల అధ్యక్షులు గ్యాదరి  రామస్వామి, కో కన్వీనర్ గ్యాదరి మల్లేశం గ్యాదరి రవీంద్ర జక్కుల అజయ్ కుమార్ గుజ్జరి నరసింహులు జక్కుల  రాకేష్ గ్యాదరి రాజారాం గ్యాదరి వాసు  సామర్ల గణేష్ గ్యాదరి మధు  గ్యాదరి సంతోష్  బొమ్మల విజయ్ దాసరి రమేష్ మెరుగు నర్సింలు  బత్తుల పరశురాం  తదితరులు పాల్గొన్నారు.