– సీపీఎం నాయకుల డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించి వరదల్లో నష్టపోయిన వారికి తక్షణమే సహాయం అందించాలని నిజామాబాద్ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత గంజ్ ప్రాంతంలో వరద భాదితులకోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా సిపిఎం ఏరియా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. గత నెల లో ఏక ధాటిగా అతి నుంచి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జనానివసల్లో కి వరద నీరు చేరి ,అనేక మంది ఇండ్లు ద్వసం అయ్యి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయం చెయ్యకపోవడం భాదకరం అని అన్నారు.అలాగే పిల్లికి బిచ్చం వేసినట్టు వరదల్లో లక్షల్లో నష్టపోయిన వారికి 10వేలు ప్రకటించడం విడ్డూరం అని ఏద్దేవ చేశారు. అయితే సిపిఎం పార్టీగా సామాన్య ప్రజల వద్దకు వెళ్ళి వరద బాధితుల కోసం చేపట్టిన విరాళాల సేకరణకు విశేష స్పందన వచ్చి , విరాళాలు చేసారని, ఇది చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వెంటనే వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు 5 -10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుజాత, మహేష్, రాములు నగర కమిటీ సభ్యులు కృష్ణ. నర్సయ్య, అనుసుజ,నాయకులు కళావతి,విశాల్ తదితులు పాల్గొన్నారు.