
భిక్కనూరు పట్టణ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర aప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 46% రిజర్వేషన్ కల్పించినందున బీసీ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు గాను బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం అధ్యక్షులు తిరుమల స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.