‘హరితహాసం’ ఆవిష్కరించిన సీఎం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో, ప్రముఖ కార్టూనిస్ట్‌ మృత్యుంజయ గీసిన ‘హరితహాసం’ కార్టూన్‌ సంకలనాన్ని సోమవారం ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. పుస్తకంలోని కార్టూన్లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ, సందేశాత్మకంగా కార్టూన్లు గీశారని అభినందించారు. కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనిశాస్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ వేణుగోపాలాచారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, రాఘవ, కరుణాకర్‌ రెడ్డి, పుస్తక సంకలనం చేసిన కార్టూనిస్ట్‌ మత్యుంజయ, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.