సీఎం ప్రకటన హర్షణీయం

Navatelangana,Adilabad,Telugu News,Telangana,నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఆర్‌ఎంపీ, పీఎంపీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడం హర్షణీయమని ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సొసైటీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భీముడు, సీపెల్లి నర్సిములు అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్‌ ఇచ్చి సర్టిఫికెట్స్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ ఎప్పటి నుండో ఉందని, దానిపై అధ్యయనం చేసి ఉత్తర్వులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ల మీటింగ్‌లో ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అర్థాంతరంగా ఆగిపోయిన కమ్యూనిటీ పారామెడిక్స్‌ ట్రైనింగ్‌ పునఃప్రారంభానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు లక్ష్మణ్‌, కిరణ్‌ కుమార్‌, రమణ, సాధిక్‌ బాబా ఉన్నారు.