
మండల కేంద్రం శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాల, కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులకు తగు సూచనలు తెలిపారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆమెతోపాటు స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, ఆర్ఐ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.