ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..

The collector made a surprise inspection of the primary health center.నవతెలంగాణ – బొమ్మలరామారం

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరుకాని డాక్టర్ శ్రీహర్షకి, ల్యాబ్ టెక్నీషియన్ మమత, సుమతి ఎంపీహెచ్ఎస్ లకు శోకజ్ నోటీసులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని,ఎంత మంది సిబ్బంది ఆబ్సెంట్ అయ్యారని ఆరా తీశారు.అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు.హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను పరిశీలించారు.ఓ. పి రిజిస్టర్ ను పరిశీలించి , ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఏ ఏ పేషెంట్లు వస్తున్నారని కలెక్టర్ అడగగా, జలుబు, దగ్గు వచ్చిన వారు వస్తున్నారని మెడికల్ ఆఫీసర్ తెలిపారు .మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు.మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని ఆరా తీశారు. గర్భిణీలు డెలివరీ కోసం ప్రైవేట్ హాస్పటల్ కు ఎందుకు వెళ్తున్నారని పేషెంట్ కుటుంబ సభ్యుల కు కలెక్టర్ ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు . ఆసుపత్రిలో ఉన్నవార్డు లను కలెక్టర్ పరిశీలించారు.హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు.